అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గర్నికం దళిత కాలనీలో మంచినీటి సమస్య తీవ్రమైంది. జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయిలు వేసినా, మూడేళ్లుగా నీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 30 కుటుంబాలు కేవలం రెండు బోర్లపై ఆధారపడుతున్నాయని, అవి కూడా గంటల తరబడి కొడితేనే నీరు వస్తుందని బాధితులు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు ఏప్రిల్ 4లోపు సమస్య పరిష్కరించాలని, లేదంటే మండల అభివృద్ధి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.