అనకాపల్లి: గృహ గణనకు వచ్చేనెల 6 వరకు గడువు పెంపు

1చూసినవారు
అనకాపల్లి: గృహ గణనకు వచ్చేనెల 6 వరకు గడువు పెంపు
గృహ గణన సర్వే గడువును వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచారం. వాస్తవానికి ఈనెల 30వ తేదీతో సర్వే పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో అధిక ఎండలు, వేసవి సెలవుల కారణంగా చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో శనివారం సాయంత్రం వరకు 92.98 శాతం మాత్రమే సర్వే పూర్తయింది. జిల్లాలో మొత్తం 5,72,356 గృహాలు ఉండగా, ఇప్పటివరకు 5,32,235 గృహాలకు సర్వే పూర్తయింది. ఈ సర్వేలో మొత్తం 2,576 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్