అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

7చూసినవారు
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 79 ఏళ్ల ఆర్ నూకాలమ్మ మృతి చెందారు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన నూకాలమ్మ, తన కుమార్తె ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తుండగా, నెహ్రూ చౌక్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరిరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్