అనకాపల్లి: గూడ్స్ రోడ్డులో వ్యక్తి మృతి

0చూసినవారు
అనకాపల్లి: గూడ్స్ రోడ్డులో వ్యక్తి మృతి
అనకాపల్లి పట్టణం గూడ్స్ రోడ్డు జంక్షన్‌లో బుధవారం ఏలూరుకు చెందిన కె.వీరబాబు (45) మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఆస్పత్రి ఓపీ చీటీ లభించింది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనకాపల్లికి ఎందుకు వచ్చాడు, ఎలా మృతి చెందాడు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.