అనకాపల్లి: మానవత్వం చాటుకున్న పోలీసులు

859చూసినవారు
అనకాపల్లి: మానవత్వం చాటుకున్న పోలీసులు
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు డి. వి. వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. తోటి ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విధంగా సేకరించిన రూ. 4, 24, 120/- నగదును జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం తన కార్యాలయంలో వెంకటరావు భార్య నీలిమకు అందజేశారు. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తోటి సిబ్బంది చూపిన సామాజిక స్పృహ అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్