అన‌కాప‌ల్లి: జనసేన ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

583చూసినవారు
యలమంచిలి మండలం జంపపాలెంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ను స్థానిక టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన యల్లపు సతీష్ ఆహ్వానం మేరకు వచ్చిన ఎమ్మెల్యేను, గతంలో ఎన్నిసార్లు పిలిచినా రాని ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా వస్తారని నిలదీస్తూ టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ నిరసనతో ఉద్రిక్తత నెలకొనడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్