అనకాపల్లి: జలమయమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ

3చూసినవారు
రాత్రి కురిసిన భారీ వర్షానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ జలమయమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికే కాంప్లెక్స్‌లోకి నీరు చేరుతుండగా, భారీ వర్షాలు కురిస్తే లోపలికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించి, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్