జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి. శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో నక్కపల్లి పోలీసులు జూదరులపై ఉక్కుపాదం మోపారు. నక్కపల్లి మండలం, చిన్న దొడ్డిగల్లు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మెరుపు దాడి నిర్వహించి, పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 73,670 నగదు, 13 సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.