అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం, అర్హులైన రైతులకు పీఏసీఎస్ చైర్మన్ వేసలపు జనార్ధన్ చేతుల మీదుగా వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎరువులు కూడా రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిల్లాడ వెంకటేశ్వర సాయి,
టీడీపీ నాయకులు వేచలపు భాస్కరరావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.