అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని పెద్ద ఉప్పలం గ్రామంలో 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీని
టీడీపీ నాయకులు పినపత్రుని గణేష్, సచివాలయ సిబ్బందితో కలిసి ఆదివారం ప్రారంభించారు. పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోవడానికి ఆసక్తి చూపారు.