అనకాపల్లి జిల్లాలో విజయనాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని వి. ఎస్. ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవతా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధినేత డాక్టర్ వడ్డీ సత్యారావు తన సొంత నిధులతో శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ముఖ్యంగా పేదల ఆకలి తీర్చడమే నిజమైన పండుగ అని పేర్కొన్నారు. విజయనాయుడు జన్మదినం సేవా కార్యక్రమాలతో జరపడం సంతోషకరమని, ఆయన ఆరోగ్యం, నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.