రాష్ట్ర పర్యాటక శాఖ అనకాపల్లి ఉత్సవ్ పాటను విడుదల చేసింది. ఈ పాటలో అనకాపల్లిలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన నూకాంబిక అమ్మవారు, బెల్లం తీపి, మాడుగుల హల్వా, ఏటికొప్పాక బొమ్మలు, కొండకర్ల ఆవ, ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరం వంటి వాటి విశేషాలను వివరించారు. ఈ పాట పర్యాటకులను ఆకట్టుకుంటోంది.