డివైడర్ను ఢీకొన్న కారు భర్త మృతి.. భార్య పిల్లలకు గాయాలు

4చూసినవారు
డివైడర్ను ఢీకొన్న కారు భర్త మృతి.. భార్య పిల్లలకు గాయాలు
శనివారం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో భర్త మహమ్మద్ హర్షద్ (35) మృతి చెందగా, అతని భార్యాపిల్లలు గాయపడ్డారు. గాజువాకకు చెందిన హర్షద్ తన కుటుంబంతో కలిసి కాకినాడలోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా హర్షద్ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.