కశింకోట: రైలు నుంచి జారిపడి..

4చూసినవారు
కశింకోట: రైలు నుంచి జారిపడి..
కశింకోట రైల్వే స్టేషన్ సమీపంలో విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడి సుమారు 55-60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎరుపు రంగు టీషర్టు, నీలం రంగు లుంగీ, తెల్ల బనియన్ ధరించి, కుడిచేతిపై స్వస్తిక్ పచ్చబొట్టు ఉన్నట్లు జీఆర్పీ ఎస్సై జి. రామారావు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే 86398 65434 నంబరులో సంప్రదించవచ్చని సూచించారు.