కోటవురట్ల మండల వైసీపీ అధ్యక్ష పదవికి కిలాడ శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో పలువురు నాయకులు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఫోన్లో మాట్లాడి తొందరపడవద్దని సూచించారు. బుధవారం ఉదయం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కూడా ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.