కోటవురట్లలో గురువారం ఉదయం నుంచి దట్టమైన మంచు కురుస్తోంది. చలిగాలులతో కూడిన ఈ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రకృతి ప్రేమికులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా, వైద్యులు వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, మంచు పడే సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణ ఏజెన్సీని తలపిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.