అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేస్తున్న సమీరను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్ స్వయంగా మాట్లాడతారని, అందుకు ఏర్పాట్లు చేశామని పోలీసులు ఎంత వివరించినా ఆమె దీక్ష విరమణకు ఒప్పుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఆమె వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.