అనకాపల్లిలో ఏసీ పేలడంతో వ్యక్తి మృతి

589చూసినవారు
అనకాపల్లిలోని లక్ష్మిదేవి పేటలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి 75 ఏళ్ల రేబాక రామారావు అనే వృద్ధుడు మృతి చెందారు. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో ఏసీ పేలడంతో మంటలు చెలరేగి, ఆయన అందులోనే చిక్కుకొని సజీవ దహనమయ్యారు. శబ్దానికి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.