మేడివాడ: ఉపాధి వేతనదారుడికి అస్వస్థత.. మృతి

246చూసినవారు
మేడివాడ: ఉపాధి వేతనదారుడికి అస్వస్థత.. మృతి
రావికమతం మండలం మేడివాడ గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాస్ (40) బుధవారం ఉపాధి పనిలో పాల్గొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వచ్చి కొంతసేపటికి స్పృహ కోల్పోవడంతో భార్య మల్లేశ్వరి అతన్ని రావికమతం PHCకి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఏరియా ఆసుపత్రికి తరలించేలోపే శ్రీనివాస్ మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.