ముషిడిపల్లి: కాలువపై తాటిదుంగలే మార్గం

5చూసినవారు
ముషిడిపల్లి: కాలువపై తాటిదుంగలే మార్గం
దేవరాపల్లి మండలం ముషిడిపల్లి జగనన్న కాలనీలో మౌలిక వసతుల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం 33 మందికి ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా, రోడ్డు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు సరైన మార్గం లేక కాలువపై తాటి దుంగలు వేసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్