జాతీయ రహదారిపై నక్కపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన లకేరామ్ బక్షి (50) మృతిచెందాడు. వ్యక్తిగత పనిమీద సైకిల్‌పై వెళ్తుండగా, తుని నుంచి విశాఖ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బక్షిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.