దొంగతనం కేసుల్లో పురోగతి.. రూ.3.91 లక్షల సొత్తు స్వాధీనం

0చూసినవారు
దొంగతనం కేసుల్లో పురోగతి.. రూ.3.91 లక్షల సొత్తు స్వాధీనం
కోటవురట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పలు దొంగతనం కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. మూడు కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి మొత్తం రూ. 3, 91, 500 విలువైన బంగారు ఆభరణాలు, నగదు, స్కూటీ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కోటవురట్ల రూరల్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ఈ వివరాలు వెల్లడించారు. నిమ్మకాయల రాజేష్‌ నుంచి రూ. 55 వేల విలువైన 4 గ్రాముల బంగారు ఆభరణాలు, దేవ ప్రకాష్‌ నుంచి రూ. 2.50 లక్షల నగదు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి, పాయకరావుపేట ప్రాంతాల్లో ఈ దొంగతనాలు జరిగినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్