రాంబిల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

1చూసినవారు
రాంబిల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. నేవీ గేటుకి మధ్యలో చెరువువద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు స్థానిక కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిగా భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.