ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం పంచాయతీ పరిధిలో వైసీపీ ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం చించివేసినట్లు వైసీపీ పాయకరావుపేట నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ చేపల రాజు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత నెల 31వ తేదీన కూడా వైసీపీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని, ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.