దేవాలయాల చోరీల కేసుల ఛేదన

316చూసినవారు
దేవాలయాల చోరీల కేసుల ఛేదన
అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాల్లో జరిగిన చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఈ వివరాలు వెల్లడించారు. జి. రాజుతో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు స్థానిక దేవాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 4.45 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు తదితర ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్