అనకాపల్లిలోని నర్సింగ్‌రావు పేటలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఒక పెద్ద చెట్టు రోడ్డుపై కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు తన సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.