గంజాయి రవాణా కేసులో ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న బొబ్బాసి వెంకటేశ్వరరావును కొత్తకోట సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేశారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో ఎస్ఐ శ్రీనివాస్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. 2016 నాటి కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న ఇతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను వదిలేది లేదని ఎస్పీ హెచ్చరించారు.