పిఆర్సి కమిటీ నియమించి ఐఆర్ ప్రకటించాలి

0చూసినవారు
పిఆర్సి కమిటీ నియమించి ఐఆర్ ప్రకటించాలి
ఎలమంచిలి మండలం ఏపీటీఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌లో రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటపతి రాజు మాట్లాడుతూ, వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమలింగపాలెం, జంపపాలెం, పెద్దపల్లి, హై స్కూల్ ప్లస్ బాలికల ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్డు గవర్నమెంట్ పాఠశాల, కొత్తపేట పాఠశాలలను సందర్శించారు. అనకాపల్లి జిల్లా ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షులు కర్రి ధర్మారావు, ఏ. చంద్రశేఖర్, భూషణం, మల్లిపాటి సత్యనారాయణ, కర్రి వీరభద్రరావు, బి. సత్యనారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్