కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఏఎల్.పురం శివారులోని అల్లూరి పార్కు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద 2 కేజీల గంజాయి లభ్యమైంది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.