అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో ఆదివారం ఉదయం పెద్దేరు గ్రామానికి చెందిన పేర్ల దేవుడు (44) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి అలల ఉధృతికి సముద్రంలో పడిపోయి మృతిచెందాడు. తోటి మత్స్యకారులు అతన్ని ఒడ్డుకు చేర్చినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.