అనకాపల్లి రాము నాయుడు కాలనీ, సుంకరమెట్ట జంక్షన్ వద్ద విజిబుల్ పోలీసింగ్ తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎటువంటి లైసెన్స్, ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలిస్తున్న మొత్తం 30 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.