రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

368చూసినవారు
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఎస్.రాయవరం మండలంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించినట్లు ఎస్ఐ రమేశ్ గురువారం తెలిపారు. అడ్డరోడ్డు నుంచి ఎలమంచిలి వైపు వెళ్తున్న బైక్ లారీకి తగలడంతో వెనుక కూర్చున్న షణ్ముఖరావు అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. మరో సంఘటనలో, అడ్డరోడ్డు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన మహిళ కాసులమ్మ, నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

సంబంధిత పోస్ట్