రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

817చూసినవారు
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి - బయ్యవరం రైల్వేట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మృతుడి వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని, ఎరుపురంగు టీషర్ట్, నేవీ బ్లూ ప్యాంట్ ధరించారని, ఎడమచేతి బొటనవేలు వద్ద RK టాటూ ఉందని తెలిపారు. అయితే మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వివరాలు తెలిస్తే 7382058996 నంబర్‌ను సంప్రదించాలన్నారు.