సెలవు రోజుల్లో స్కూల్ తెరిస్తే చర్యలు తీసుకుంటాం

152చూసినవారు
సెలవు రోజుల్లో స్కూల్ తెరిస్తే చర్యలు తీసుకుంటాం
అనకాపల్లి జిల్లాలో సెలవు రోజుల్లో, ముఖ్యంగా ఆదివారం, ప్రైవేట్ పాఠశాలల్లో టాలెంట్ టెస్టుల పేరుతో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి (డీఈఓ) అప్పారావు నాయుడు శనివారం హెచ్చరించారు. సెలవు దినాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని, తప్పనిసరిగా ఒంటిపూట సెలవులు ఇవ్వాలని, రెండోపూట తరగతులు పెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆకస్మిక తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్