తాళ్లపాలెం సంత మార్కెట్ జనసంచారంలోకి వచ్చిన ఒక అడవి దుప్పి స్థానికులను సోమవారం భయభ్రాంతులకు గురిచేసింది. యువకులు దానిని పట్టుకొని చెట్టుకు కట్టేయగా, జనం రద్దీతో భయపడి తాడు తెంపుకొని ఏలేరు కాలువలోకి దూకింది. కొంతదూరం ఈదుకుంటూ వెళ్లి, కాలువ మెట్ల మార్గం ద్వారా తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.