హుకుంపేట మండలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలోని పేరు, చిరునామా, వయస్సు వంటి వివరాల సవరణ, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల నవీకరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు చేపడుతున్నారు. మండల ప్రజలందరూ బీఎల్ఓలకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించాలని హుకుంపేట ఎంఆర్ఓ తెలిపారు. ఈ సర్వే 2026 జూన్ 30 వరకు కొనసాగనుంది.