అనంతగిరి ఏటిడబ్ల్యూఓగా కె శాంతి బాధ్యతలు స్వీకరణ

1233చూసినవారు
అనంతగిరి ఏటిడబ్ల్యూఓగా కె శాంతి బాధ్యతలు స్వీకరణ
అనంతగిరి మండల సహాయ గిరిజన సంక్షేమ అధికారి (ATWO)గా కె శాంతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సేవలందించిన ఆమె, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలానికి బదిలీపై వచ్చారు. మండల ఏటిడబ్ల్యూఓ కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్