ముంచంగిపుట్టులో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం

523చూసినవారు
ముంచంగిపుట్టులో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తులో వైకల్యాలను అరికట్టవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్