BSNL టవర్లున్నా.. ఐదు రోజులుగా సిగ్నల్ లేదు: ప్రజల ఆవేదన

810చూసినవారు
BSNL టవర్లున్నా.. ఐదు రోజులుగా సిగ్నల్ లేదు: ప్రజల ఆవేదన
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, పైనంపాడు పంచాయతీ పరిధిలోని కంగుపుట్టు, దుర్గం, కాకరపాడు, దొండలవలస గ్రామాలలో BSNL టవర్లు ఉన్నప్పటికీ, గత ఐదు రోజులుగా సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనుల హాజరు నమోదుకు సిగ్నల్ లేకపోవడం వల్ల అవరోధాలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. BSNL అధికారులు వెంటనే స్పందించి సెల్ సిగ్నల్ సేవలను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్