భీమిలి: వాంబే కాలనీ జెడ్పీ స్కూల్‌లో కొత్త గదుల ప్రారంభం

1509చూసినవారు
మధురవాడ జీవీఎంసీ జోన్-2 పరిధిలోని వాంబే కాలనీ జిల్లా పరిషత్ సునీల్ శర్మ హైస్కూల్‌లో రూ. 40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన మూడు నూతన తరగతి గదులను విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, భీమిలి యువ నాయకుడు గంటా రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పాఠశాలలో అదనపు గదులు, గ్రిల్స్, లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటుతో పాటు గ్రౌండ్ లెవెలింగ్, ఆర్వో ప్లాంట్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వసతులు పెరగడం వల్లే ఈ ఏడాది ఈ స్కూల్‌లో అదనంగా 80 మంది కొత్త విద్యార్థులు చేరారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్