చోడవరం - Chodavaram

చోడవరంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

చోడవరంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

చోడవరం ఇందిరా కాలనీలో శనివారం మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా వర్కింగ్ కండెల్లి వెంకటరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తల ఈశ్వరరావు, రాధిక ఉద్యోగుల సంఘం జిల్లా ట్రెజరరీ పెడమట్ల తాతాజీ, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా సీనియర్ నాయకులు అత్తోట వజ్రభూషణంతో పాటు ఇతర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

వీడియోలు


కొమరంభీం జిల్లా
కొమురంభీం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Dec 06, 2025, 03:12 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్

కొమురంభీం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Dec 06, 2025, 03:12 IST
కాగజ్ నగర్ మండలంలోని గన్నారం-ఆరెగూడ మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్ (23) అనే యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గన్నారం గ్రామానికి చెందిన కార్తీక్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన గడ్డి లోడ్ చేసిన ట్రాక్టర్ ఢీకొట్టింది. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఈజ్ గాం ఎస్సై కల్యాణ్ మాట్లాడుతూ, అతివేగంగా, నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ కన్నవే అనిల్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.