చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో అత్తా కోడళ్ళ మధ్య జరిగిన వివాదంలో అత్త కె.పసలమ్మ కోడలు నాగమణి దాడిలో మృతి చెందింది. నాగమణి కట్టెల కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన పసలమ్మను అనకాపల్లి
ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.