ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

795చూసినవారు
ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
చోడవరం లోని లక్ష్మీపురం పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్డాది నుంచి చోడవరం వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మార్గంలో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్