అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో పోలమాంబ అమ్మవారి జాతర మంగళవారం అతి వైభవంగా జరగనుంది. ఈ పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ కాంతులతో మెయిన్ రోడ్ అంతా అలంకరించారు. ఐటి కాలనీ, పూర్ణ థియేటర్, రెల్లి వీధి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుంది. జాతర జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.