రైతుకు పాము కాటు.. పరిస్థితి విషమం

7చూసినవారు
రైతుకు పాము కాటు.. పరిస్థితి విషమం
రావికమతం మండలం గర్ణికం గ్రామానికి చెందిన గుమ్మాల కళ్యాణం (62) గురువారం తన సొంత పొలంలో వేరుశనగ పంటను తీస్తున్నప్పుడు పాము కాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో నర్సీపట్నం తరలించారు.

సంబంధిత పోస్ట్