రోడ్డు కోసం వినూత్న నిరసన

461చూసినవారు
రోలుగుంట మండలం భోగాపురంలో బీఎన్ రోడ్డు దుస్థితిపై సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. భీమినిపట్నం-చోడవరం-పాడేరు రహదారి గ్రానైట్ క్వారీ వాహనాల వల్ల పూర్తిగా గొయ్యిలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని, ఎన్నికల హామీలు, అధికారుల పరిశీలనలు జరిగినా పనులు ప్రారంభం కాలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్