ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ఉద్యోగ కల్పన లక్ష్యంగా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో సుమారు 12 బహుళజాతీయ కంపెనీలు పాల్గొంటాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఎన్. గోవింద రావు తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి, 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల నిరుద్యోగులు నైపుణ్యం.ఏపీ.జిఓవి.ఐఎన్ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.