కాలుష్య పరిశ్రమలను ఆపండి: గాజువాక ప్రజల మానవహారం

1474చూసినవారు
కాలుష్య పరిశ్రమలను ఆపండి: గాజువాక ప్రజల మానవహారం
విశాఖపట్నం, గాజువాక ప్రాంత ప్రజలు కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకంగా శ్రీకృష్ణదేవరాయల సెంటర్ నుండి వై జంక్షన్ వరకు ఆదివారం మానవహారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయాలని, విశాఖ ఉక్కు భూముల్లో విదేశీ పరిశ్రమలతో కలిసి అదానీ నిర్మిస్తున్న కాలుష్య పరిశ్రమలను ఆపాలని డిమాండ్ చేశారు. కాలుష్యాన్ని నివారించకపోతే గంగవరం పోర్టును ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి, గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్