అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ కాలువ వద్ద శనివారం ఓ రైతుకు ఏదో శబ్దం వినిపించింది. ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు. ఏదో కదులుతున్నట్టు కనిపించడంతో తొంగి చూస్తే భారీ గిరినాగు కనిపించింది. భయాందోళనకు గురైన అతను స్థానికులకు సమాచారం అందించగా వారు అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ కు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అతను కాలువ లోపల నుంచి పైకి వస్తున్నట్టు గుర్తించాడు. ముందుగా చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆతరవాత రెండు గంటలు శ్రమించి దానిని బంధించి సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.