దేవరాపల్లి మండలం పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పెనగంటి నరసింహమూర్తి (34) విశాఖపట్నం ఎండాడ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను దించి తిరిగి వస్తుండగా, వేకువజామున 3.30 గంటల సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో నరసింహమూర్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.